ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని కలిసిన కియా ప్రతినిధులు.అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో కొత్తకారు ఆవిష్కరణకు ఆహ్వానించడానికి కియా ప్రతినిధులు సోమవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కియా ఎండీ, సీఈవో కుక్ హ్యూన్ షిమ్, సీఏవో థామస్ కిమ్.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెనుగొండ ప్లాంటు ద్వారా ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయగలమని తెలిపారు. భవిష్యత్తులో ఏడు లక్షల కార్లు ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటామన్నారు.
0 Comments:
Post a Comment